తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Yatra-2: యాత్ర 2 ట్రైలర్ అప్‌డేట్‌.. ఎల్లుండే రిలీజ్!

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా డైరెక్టర్ మహి వి.రాఘవ్ తీసిన ‘యాత్ర’ సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘యాత్ర’ సీక్వెల్‌గా మళ్లీ ఎన్నికల ముందే యాత్ర-2 సినిమాను తీసుకొస్తున్నారు. ఇందులో తమిళ నటుడు జీవా వైఎస్ జగన్ పాత్రలో నటిస్తుండగా.. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది. ఈనెల 3వ తేదీన ఉదయం 11గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ALSO READ: ఆసక్తిగా ‘భామాకలాపం 2’ టీజర్… రిలీజ్ డేట్ ఫిక్స్

ఒక్కటి గుర్తు పెట్టుకోండి..

ఈ సినిమా నుంచి ఇటీవల పోస్టర్, టీజర్ విడుదల చేయగా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. ఇవాళ మేకర్స్ మరో ప్రకటన అనౌన్స్ చేశారు. ఇందులో ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ మేకర్స్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ మూవీని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024 ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button