తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు… సఫలం కానున్నాయా?

మున్సిపల్ కార్మికులకు 6 వేలు అలవెన్స్ జగన్‌ సర్కార్‌ ప్రకటించింది . అయితే… ఈరోజు కూడా మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నాం 12 గంటలకు కార్మిక సంఘాలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆదిమూలపు సురేష్ భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలోని సెకెండ్ బ్లాక్ లో ఈ సమావేశం జరుగనుంది. సమాన పనికి సమాన వేతనం పై సీఐటీయూ పట్టుబడుతోంది.

Also Read: మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ వర్కర్స్ పలు డిమాండ్ల పై సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు మరికొన్ని క్యాటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది . అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్ కు నెలకు 6 వేల రూపాయల ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ జీవో కూడా ఇచ్చేసింది.

Also Read: ఏపీపై సీఎం రేవంత్ ఫోకస్.. ఇరకాటంలో పడనున్న జగన్?

గతంలో కార్మిక సిబ్బంది అందరినీ పర్మినెంట్‌ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనంగా నెలకు 20 వేలు బేసిక్‌ పే ఇవ్వాలని సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అమరావతి సచివాలయంలోని తన చాంబర్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీఎండబ్లూఈఎఫ్‌, ఏఐసీటీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎఫ్ టీయూ, ఎమ్మార్పీఎస్‌ సంఘాల నాయకులతో పాటు ఇతర సంఘాలు చర్చల్లో పాల్గొన్నాయి. సమ్మె విరమించాలని మంత్రి కోరగా, తమ డిమాండ్లు అన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే, తాము చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని నాయకులు తేల్చిచెప్పారు. కార్మికుల నుంచి స్పష్టత తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సారి చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button