తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Lionel Messi: మెస్సీకి అరుదైన గౌరవం… ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

ఫుట్‌బాల్ దిగ్గ‌జాల్లో ఒక‌డైన‌ లియోన‌ల్ మెస్సీకి అరుదైన గౌర‌వం ల‌భించ‌నుంది. ప్రపంచ ఫుల్ బాల్ చరిత్రలో అర్జెంటీనా దిగ్గజాలు డిగో మారడోనా, లియోనెల్ మెస్సీ ఇద్దరూ ఎప్పటికీ నిలిచిపోతారు. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే ఆటతీరుతో వారు సాకర్ ప్రపంచంపై తమదైన ముద్రను వేశారు. అయితే, మారడోనాకు లభించని గౌరవం మెస్సీకి లభించింది. మెస్సీ ధరించే 10వ నెంబర్ జెర్సీని మరెవరికీ కేటాయించకూడదని, ఆ జెర్సీకి శాశ్వతంగా ముగింపు పలకాలని అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

Also Read: బిజీబీజీగా టీమిండియా.. 2024 మ్యాచ్ షెడ్యూల్ ఇదే

మెస్సీ జెర్సీని మరెవరికీ ఇవ్వకూడదని తీర్మానించినట్టు అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు క్లాడియో తపయా వెల్లడించారు. తమ దేశ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీకి తాము చేయగలిగిన చిన్న పని ఇదేనని చెప్పారు. మరోవైపు అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పట్ల మెస్సీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. వన్డేలకు బై బై

గ‌తంలో 10వ నంబ‌ర్ జెర్సీతో మార‌డోనా మైదానంలో అద్భుతాలు చేశాడు. అత‌డు వీడ్కోలు ప‌లికిన అనంత‌రం ఆ జెర్సీని కూడా ఎవ‌రికీ కేటాయించొద్ద‌ని అర్జెంటీనా భావించింది. కానీ, అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ స‌మాఖ్య అర్జెంటీనా ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చింది. నిరుడు ఖ‌తార్‌లో జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అర్జెంటీనాను ఫైన‌ల్‌కు చేర్చిన మెస్సీ.. త‌న క‌ల‌ను నిజం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైన‌ల్లో ఫ్రాన్స్‌పై గెలుపొందిన మెస్సీ సేన స‌గ‌ర్వంగా ట్రోఫీని అందుకుంది. అనంతరం అత‌డు పీఎస్‌జీ క్ల‌బ్‌ను వీడి ఇంట‌ర్ మియామితో ఒప్పందం చేసుకున్నాడు. మేజ‌ర్ సాక‌ర్ లీగ్‌లో సంచ‌ల‌న ఆట‌తో మియామి క్ల‌బ్‌ను విజేత‌గా నిలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button