తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Jude Bellingham: ‘గోల్డెన్ బాయ్’ అవార్డు దక్కించుకున్న ఇంగ్లండ్ ఫుట్‌బాల‌ర్‌

ఇంగ్లండ్, రియ‌ల్ మాడ్రిడ్ మిడ్ ఫీల్డ‌ర్ జుడె బెల్లింగ‌మ్ ప్ర‌తిష్ఠాత్మ‌క గోల్డ్‌న్ బాయ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. ఈ ఏడాది అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు గానూ జుడె ఈ అవార్డు అందుకోనున్నాడు. యూర‌ప్ వ్యాప్తంగా అండ‌ర్ -21 కేట‌గిరీలో ప్ర‌క‌టించే ఈ అవార్డుకు ఈసారి న‌లుగురు పోటీ ప‌డ్డారు.

Also Read: కోహ్లీ విషయంలో నా తప్పు లేదు: గంగూలీ

20 ఏండ్లకే అవార్డు

జ‌మ‌ల్ ముసియ‌ల‌, ర‌స్మ‌స్ హోజ్‌లుండ్, లెవీ కోల్‌విల్‌ల‌ను వెన‌క్కి నెట్టి 20 ఏండ్ల జుడే విజేత‌గా నిలిచాడు. దాంతో, ఈ అవార్డు అందుకున్న మూడో ఇంగ్లండ్ ఫుట్‌బాల‌ర్‌గా జుడె రికార్డు నెల‌కొల్పాడు. ఇంగ్లండ్ దిగ్గ‌జం వేన్ రూనీ(2004), ర‌హీం స్టెర్లింగ్‌(2014)లో ఈ అవార్డు గెలిచారు. అంతేకాదు అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ, ఫ్రాన్స్ యువ‌కెర‌టం కైలియ‌న్ ఎంబాపే కూడా గోల్డెన్ బాయ్ అవార్డు అందుకున్నారు. ఈ సీజ‌న్‌లో జుడె 15 గోల్స్ కొట్ట‌డ‌మే కాకుండా 17 గోల్స్‌కు సహక‌రించాడు. ఇంగ్లండ్ త‌ర‌ఫున 12 మ్యాచ్‌లు ఆడిన జుడె రెండు గోల్స్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button