తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Football: మైదానంలో హఠాత్తుగా కుప్ప‌కూలిన‌ ఫుట్‌బాల‌ర్… మ్యాచ్ రద్దు

లండ‌న్‌లో జ‌రుగుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రీమియ‌ర్ లీగ్‌లో ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతూనే ల్యూట‌న్ టౌన్ ఫుట్‌బాల్ క్ల‌బ్‌ జ‌ట్టు కెప్టెన్ టామ్ లాక్‌య‌ర్ మైదానంలో కుప్ప‌కూలిపోయాడు. బౌర్నెమౌత్ జ‌ట్టుతో మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

Also Read: ఐపీఎల్‌ చరిత్రలో మొదటి మహిళా వేలం నిర్వాహకురాలు.. ఆమె ఎవరో తెలుసా?

ఆట ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా 29 ఏండ్ల‌ లాక్‌య‌ర్‌కు చాతిలో నొప్పి మొద‌లైంది. గుండె కొట్టుకోవ‌డం ఆగిపోవ‌డంతో అత‌డు ఉన్న‌చోట‌నే మైదానంలో కూల‌బ‌డిపోయాడు. అత‌డ‌లా ప‌డిపోవ‌డం గ‌మ‌నించిన తోటి ఆట‌గాళ్లు ఒక్క‌సారిగా షాక‌య్యారు. స్టేడియంలో అందుబాటులో ఉన్న‌ వైద్య సిబ్బంది అత‌డికి అత్య‌వ‌స‌ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

Also Read: విజృంభించిన భారత బౌలర్లు.. కుప్పకూలిన సఫారీ టాప్ ఆర్డర్

అప్ప‌టికీ ఇరుజ‌ట్ల స్కోర్ 1-1తో స‌మంగా ఉంది. అయితే.. లాక్‌య‌ర్ ఉన్న‌ట్టుండి ఆస్ప‌త్రి పాల‌వ్వ‌డంతో రిఫ‌రీలు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. లాక్‌య‌ర్ ప్రాణాలు కాపాడిన‌ ఇరుజ‌ట్ల వైద్య సిబ్బందికి ల్యూట‌న్ టౌన్ ఫుట్‌బాల్ క్ల‌బ్ మేనేజ్‌మెంట్ ధ‌న్య‌వాదాలు తెలిపింది. ప్ర‌స్తుతం లాయ్‌క‌ర్ ఆరోగ్యం నిల‌క‌డగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button