తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: సీఎం జగన్ అంటే పవన్ కళ్యాణ్‌కి వణుకు..! కారణం అదేనా?

సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు విన్నా, వైసీపీ పేరు విన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గజగజ వణికిపోతున్నారా? తాను పోటీ చేసే స్థానాన్ని ముందే ప్రకటిస్తే వైసీపీ ఎలాగైనా తనను ఓడిస్తుందని పవన్ లోలోపల మథనపడిపోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. పవన్‌కు జగన్ భయం పట్టుకుందని జనసేన నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారట.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలు దాదాపు ఖాయమయ్యాయి. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కానీ ఇప్పటికీ జనసేనాని పోటీ చేసే స్థానంపై మాత్రం స్పష్టత రాలేదు. తాను పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం గురించి ముందే ప్ర‌క‌టిస్తే, జ‌గ‌న్ ఎలాగైనా ఓడిస్తాడ‌ని పవన్ తీవ్ర ఆందోళ‌నలో ఉన్నారని వినిపిస్తోంది.

ALSO READ: భీమిలీ సీటుపై మళ్లీ రగడ.. టీడీపీలో వర్గపోరు… తమదే సీటు అని జనసేన ప్రచారం

సీన్ రిపీట్ అవుతుందా?

కాబట్టి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారట. ఎందుకంటే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ రెండు స్థానాలు భీమ‌వ‌రం, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు చోట్ల కూడా పవన్ ఓటమి వెనుక వైసీపీ భారీ వ్యూహం ఉంది. రెండు స్థానాల్లో పవన్ ఓడిపోవడానికి వైసీపీ వ్యూహాలే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాను పోటీ చేసే స్థానాలను ముందే ప్రకటిస్తే గతంలో జరిగిన సీనే రిపీట్ అవుతుందని పవన్ భావిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button