తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman Records: నెల రోజులైనా… తగ్గని హవా.. ‘హనుమాన్‌’ ఖాతాలో మరో రికార్డు

సరిగ్గా ఇదే రోజున, అంటే జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీ ‘హనుమాన్’. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. నెల రోజులుగా పలు సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇటీవల కాలంలో 30 రోజుల పాటు, 300లకు పైగా సెంటర్లలో ప్రదర్శితమవుతున్న చిత్రంగా ‘హనుమాన్’ మరో రికార్డును సృష్టించింది.

ALSO READ: యానిమల్’ మూవీ అరుదైన రికార్డు

త్వరలో పట్టాలెక్కనున్న ‘జై హనుమాన్’

ఇక.. ఈ మూవీ విజయంతో దర్శకుడు ప్రశాంత వర్మ, తేజ సజ్జాకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. ఈ ఇద్దరికీ పెద్ద పెద్ద స్టార్ల నుంచి సైతం అవకాశాలు దక్కినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమా విజయం తర్వాత దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని తొందర్లోనే పట్టాలెక్కించేందుకు ప్రశాంత్ వర్మ సిద్ధమైపోయారు.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. మరోవైపు ‘హనుమాన్’ హీరో తేజ సజ్జాకు ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను త్వరలోనే తేజతో సినిమా చేస్తానని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button