తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ సిద్దం!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయభేరిని మోగించి అధికార పీఠాన్ని అధిరోహించేది ఎవరు? ఓటమి పాలై ఇంటిబాట పట్టేదెవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. జూన్ 1న వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. మరోవైపు పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో అది ప్రభుత్య వ్యతిరేకతకు సంకేతమని భావిస్తున్న టీడీపీ నేతృత్వంలోని కూటమి ఈసారి తమదే గెలుపు అని చెబుతోంది.

ALSO READ: భార‌త్‌-పాక్ టీ-20 మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు..!

గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ పోలింగ్ శాతం ఇటు అధికార పార్టీని, అటు ప్రతిపక్షపార్టీని గెలపుపై అంచనాలు ఏర్పడేలా చేసింది. గ్రామీణ స్థాయిలో మహిళా ఓట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో మహిళా ఓట్లు పెరగడంతో తామే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత.. పలు వర్గాల్లో ఉన్నఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button