తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. నాలుగున్నరేళ్లల్లోనే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన వైసీపీ.. కేవలం నాలుగున్నరేళ్లలో 130 భారీ ప్రాజెక్టులు ప్రారంభించి రూ.69 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది. అంతకుముందు కోవిడ్ ప్రభావంతో రెండేళ్లు ఎదురైన తీవ్రమైన ఇబ్బందులను అధిగమించింది. ఈ మేరకు సీఎం జగన్ కనీవినీ ఎరుగని స్థాయిలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’లో ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో రూ.13.11 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయి. 386 విలువైన ఒప్పందాలు ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ రాష్ట్రంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.

ALSO READ: వెంకటగిరిలో బాబు.. విజయవాడలో జగన్.. ప్రజా మద్దతు తేలిపోయిందా?

ప్రతీ ఏటా పెరుగుతున్న పెట్టుబడులు

చంద్రబాబు హయాంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు ఉండగా.. 2019లో వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3.87 లక్షల ఎంఎస్‌ఎంఈలు తీసుకొచ్చారు. దీంతో సుమారు 12.61 లక్షల మందికి ఉపాధి కలిగింది. అయితే ప్రతి ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి మధ్యలో 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రాగా, 2020- 21లో 85.85 మిలియన్ డాలర్లు, 2021-22లో 224.96 మిలియన్ డాలర్లు, 2022- 23లో ఏకంగా 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ ప్రభావంతో 2020-21లో మాత్రమే పెట్టుబడుల్లో క్షీణత ఉందని, తర్వాత క్రమేపీ పెరిగాయని ఆర్థికవేత్తలు వెల్లడించారు.

ALSO READ: గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. పోలీసుల చర్యలు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌ వన్..

దేశంలో పెట్టుబడులపై ‘ప్రాజెక్ట్స్‌ టుడే’ సర్వే ప్రకారం.. 2022–23లో రూ.7.65 లక్షల కోట్ల ఒప్పందాలతో మొదటి స్థానంలో ఏపీ ఉండగా.. రూ.4.44 లక్షల కోట్లతో గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. ఇక 1.58 లక్షల కోట్లతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఏపీలో పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటించడంతోనే ఇది సాధ్యమైందని, రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ధేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని విశాఖలో జరిగిన సదస్సులో పారిశ్రామిక వేత్తలు వెల్లడించారు. ప్రభుత్వ కృషితో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో దేశంలోనే ఏపీ నంబర్ -1లో నిలిచింది. ఇవే కాకుండా రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమలు నిర్మాణం, ఏర్పాటు దశలో ఉన్నాయి. అయితే చంద్రబాబు, పచ్చ మీడియాలో ఏపీ పారిశ్రామిక ప్రగతిపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం గమనార్హం. అయితే రాష్ట్రంలో నెలకొల్పిన పరిశ్రమలు, ఎన్ని పెట్టుబడులు, ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో తెలుసుకుందాం.

క్రమ సంఖ్యకంపెనీ పెట్టుబడి ఉత్పత్తిఉపాధి
1గ్రాసిమ్ ఇండస్ట్రీస్రూ. 861 కోట్లుకాస్టిక్ సోడా1,300
2ప్యానల్ ఆఫ్టో డిస్ ప్లే టెక్నాలజీస్రూ.1,230 కోట్లుటీవీ డిస్ ప్లే ప్యానల్స్ 2,200
3ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్రూ. 1,050 కోట్లుప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్‌ 2,000
4సన్నీ ఒప్పో టెక్రూ. 280 కోట్లు కెమెరా మాడ్యూల్స్1,200
5ఏటీసీ టైర్స్రూ.1,250 కోట్లుహాఫ్ హైవే టైర్స్840
6రాంకో సిమెంట్స్రూ.1,790 కోట్లుసిమెంట్1,000
7డిక్సన్రూ.127 కోట్లుసీసీ కెమెరాలు1,800
8గ్రీన్ లామ్ సౌత్రూ. 800 కోట్లులామినేషన్స్‌1,050
9ఇన్ఫోసిస్ రూ.35 కోట్లుఐటీ డెవలప్‌మెంట్ 1000
10యుజియా స్టైరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్రూ.500 కోట్లు ఫార్మా 750
11లారస్ సింథటీస్ ల్యాబ్ రూ.191 కోట్లుబల్క్ డ్రగ్ 300 
12లారస్ ల్యాబ్రూ. 440 కోట్లుబల్క్ డ్రగ్ 500
13సెంచురీ ప్యానల్స్రూ. 1000 కోట్లుప్లై ఉడ్2,266 
14ఇంటిలిజెంట్ సెజ్రూ.70 కోట్లుపాదరక్షల ఉపకరణాలు2000 
15సెంచరీ ప్లై ఉడ్ (ఇండియా) లి.రూ. 1600 కోట్లు ఫ్లై ఉడ్ ప్యానెల్స్2000
16ఆదిత్య బిర్లా గార్మెంట్స్ రూ.11038 కోట్లు గార్మెంట్స్2,112
17హిల్ టాప్ సెజ్‌ ఫుట్ వేర్రూ.700 కోట్లుఫుట్ వేర్10,000
18డిక్సన్ టెక్నాలజీస్రూ.108 కోట్లుటెలివిజన్స్830
19ఫాక్స్‌ లింక్ ఇండియా విస్తరణరూ.300 కోట్లుస్యార్ట్ వాచీలు, ఇయర్ పాడ్స్1200
20ఏటీసీ టైర్స్ ఫేజ్ -2రూ.1000 కోట్లుటైర్ల తయారీ1160
21పిడిలైవ్ ఇండస్ట్రీస్రూ.202 కోట్లువాటర్ ప్రూపింగ్ ఉత్పత్తులు280
22మేఘా ఫ్రూట్ ప్రాసెసింగ్రూ.186 కోట్లుఆహార ఉత్పత్తులు677
23ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్‌రూ.145 కోట్లుపారిశ్రామిక వాయువులు70
24 ఆప్టిమస్ డ్రగ్స్‌ రూ.125 కోట్లుఫార్మా న్యూటికల్స్‌185
25విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ రూ.108 కోట్లుఇన్సులేటర్స్‌382
26స్టేరాక్స్ లైఫ్ సైన్సెస్‌రూ.88 కోట్లుబల్క్ డ్రగ్450
27సినాప్టిక్స్ ల్యాబ్స్ రూ.82 కోట్లుబల్క్ డ్రగ్300
28ఇషా రిసోర్సెస్‌రూ.68 కోట్లుకోక్ అండ్ కోల్ స్క్రీనింగ్220 
29అసాగో ఇండస్ట్రీస్ రూ.270 కోట్లుబయో ఇథనాల్500
30జేఎస్ డబ్ల్యూ స్టీల్ రూ.8,800 కోట్లుఉక్కు తయారీ2,500
31క్రిభ్‌కో బయో ఇథనాల్రూ.560 కోట్లు బయో ఇథనాల్400
32ఎకో స్టీల్ ఇండియా రూ.540 కోట్లుబయో ఇథనాల్500
33 ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ రూ.250 కోట్లుస్టీల్ బిల్డింగ్ యూనిట్స్ 1500
34యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ రూ. 225 కోట్లుఆటోమొబైల్ యాక్ససరీస్250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button