తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: ‘హనుమాన్’ సినిమా కలెక్షన్స్.. 8 రోజుల్లో ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ‘హనుమాన్’. ఈ సినిమా న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల మార్కును అందుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లు, హిందీలో రూ.30 కోట్ల వరకు రాబట్టగా.. ఇతర భాషల్లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తర్వాత మరింత కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ALSO READ: దేవుడు నమ్మకం, వైఎస్ఆర్ నిజం… ‘యాత్ర 2’ నుంచి సాంగ్‌ రిలీజ్‌

ఆకట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్

హనుమాన్ చిత్రంలో హనుమంతుడిని చూపించిన తీరు, వీఎఫ్ఎక్స్, ఎంటర్‌టైన్‍మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్‌ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button