తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: ఉద్యోగాల కల్పనలో ఏపీ ముందు వరుస.. కొత్తగా మరో నోటిఫికేషన్

ఏపీ ఉద్యోగాల కల్పనలో ముందు వరుసలో ఉంది. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. అందులో దాదాపు 2 లక్షల ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగాలు కాగా.. మిగిలినవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కింద నియమించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగంలో ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులో భాగంగానే వైద్యారోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

Also read: Students Admission: విద్యారంగంలో సర్కారు మార్పులు.. దేశంలోనే నెం.1 గా ఏపీ

రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఇంటర్వ్యూ ద్వారా, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయన్నుట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘‘సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్, హనుమాన్ పేట, విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ ఇన్‌ రిక్రూట్మెంట్ జరగనుంది’’ అని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button