తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pawan Kalyan: ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్‌డేట్… రిలీజ్ డేట్ ఫిక్స్

సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఓజీ. ఈ చిత్రం నుంచి మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట వ్యూస్‌ పంట పండిస్తూ.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇక ఈ మూవీ చిత్రబృందం తాజాగా క్రేజీ అప్ డేట్ అందించింది. ఫైనల్‌గా చాలా రోజుల సస్పెన్స్‌ తర్వాత ఓజీ ఎప్పుడు విడులవుతుందనేది మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. పవర్‌ స్టార్‌ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్‌ ఎవెయిటెడ్‌ ప్రాజెక్టును సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Also Read: యాత్ర-2′ నుంచి ‘తొలి సమరం’ సాంగ్‌ విడుదల

ఈ మూవీలో గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా, సీనియర్ యాక్టర్‌ వెంకట్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకట్‌ బూట్‌కట్ ప్యాంట్‌, ఫుల్‌ షర్ట్‌లో చేతిలో పిస్తోల్‌ పట్టుకున్న లుక్‌ రీసెంట్‌గా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవగా.. ఆ స్టిల్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఓజీ గ్లింప్స్‌లో పవన్‌ కల్యాణ్‌ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button