తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: అగమ్యగోచరంగా వాలంటీర్ల పరిస్థితి… సర్కార్‌పై పోరాటానికి సిద్ధం

చాలా సందర్భలలో వాలంటీర్లపై ఏపీలోని కూటమి నేతలు విషం చిమ్మారు. అయితే తాము అధికారంలోకి రావడానికి వాలంటీర్ల సహాయం కూడా కీలకమని భావించిన కూటమి నేతలు ఆ తర్వాత వారిని మచ్చిక చేసుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వచ్చిన కూడా వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనంగా రూ.10 వేలు ఇస్తామని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత పరిస్థితులు మరోలా ఉన్నాయి.

ప్రస్తుతం వాలంటీర్లను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. తాజాగా ఏపీలో పెన్షన్ల పంపకాలు జరిగాయి. అయితే ఈ పనికి వాలంటీర్లను కాదని సచివాలయ సిబ్బందితోనే ప్రభుత్వం వృద్దులకు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను పంపిణీ చేసింది. దీంతో వాలంటీర్లతో ఇక పనేముంది? వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుంది.. అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దాంతో వాలంటీర్లలో ఆందోళన స్టార్ట్ అయింది. తమను తొలగిస్తారేమో అని వారు ఆందోళన పడుతున్నారు.

అయితే, గ్రామంలో వాలంటీర్ అయి ఉండి, ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కలిపించకపోవడంతో.. వాలంటీర్ల వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఛలో విజయవాడ కార్యక్రమంపై విజయవాడ పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాలంటీర్లు రేపు ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని వెల్లడించారు. అలాగే, తమకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని తలబెడితే వారిని ఉక్కుపాదంతో తొక్కివేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉంది.. కాబట్టి అనుమతి లేదనే విషయాన్ని వాలంటీర్లకు తెలియజేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. ఇక, వేరే ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాలంటీర్లను అదుపులోకి తీసుకోవటానికి రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button