తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: ఏపీలో ఉద్యోగాల జాతర.. నిరుద్యోగుల ముఖాల్లో కళ

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. సీఎం జగన్ నిరుద్యోగుల కష్ట నష్టాలను అంచనా.. ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సమగ్ర వివరాలు తెప్పించుకుని వాటిని భర్తీ చేసేందుకు.. అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అందులో భాగంగానే ప్రభుత్వం వరస పెట్టి నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తోంది.

నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. తొలుత 897 పోస్టులతో గ్రూప్- 2.. మరుసటి రోజే 81 పోస్టులతో గ్రూప్- 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసి యువతకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. దీంతో నిరుద్యోగుల ముఖాల్లో కొత్త కళ కనిపిస్తోంది. ఇక ఉద్యోగాల సాధించేందుకు సాధన ప్రారంభించారు. ఇక ఉద్యోగాల భర్తీలో తన చిత్తశుద్ధి ఏంటో జగన్ సర్కార్ చూపించుకుంటోంది.

ప్రభుత్వ హయాంలో భారీగా ఉద్యోగాల భర్తీ

ఇక గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీచేయనున్నారు. అందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులు ఉన్నాయి. అదే విధంగా 897 గ్రూప్ -2 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 ఉండగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించినట్టు లెక్కలు చెప్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఎన్నడూ భర్తీ చేసిన దాఖలాలు లేవు. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని.. నిబంధనలు సవరించి వారిని కూడా రెగ్యులరైజ్ చేశారు.

Also read: Praja Darbar: తెలంగాణలో ప్రజా దర్బార్.. మరి ఏపీలో..?

మరోవైపు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానికంగానే జాబ్స్ ఇచ్చి కొత్త చరిత్రను సృష్టించారు. దానివల్ల పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు సులభంగా పరిష్కారం కావడంతోపాటు.. వారి జీవితాలు కూడా మెరుగయ్యాయి. ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు. 3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఇక యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. దీంతో ఏపీలోని జగన్ సర్కారు నిరుద్యోగుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అని.. ఇది ప్రభుత్వ విజయంగా వైసిపి నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో ఇంతకు ముందు ఏ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను పట్టించుకోని విధంగా.. జగన్ ప్రభుత్వం భారీగా ఉద్యోగుల భర్తీ చేస్తుండటంతో పలువురు రాజకీయ, విద్యా వేత్తలు, మేధావులు జగన్ సర్కారును మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button