తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Notices: అగ్ర హీరోలు షారూక్, అజయ్ దేవగణ్, అక్షయ్ కు భారీ షాక్

ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన సినీ నటీనటులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా తాజాగా అగ్ర నటులు షారూక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవగణ్ (Ajay Devgn), అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు భారీ షాక్ తగిలింది. గుట్కా (Tobacco) సంబంధిత ప్రకటనల్లో నటించిన కారణంగా ఆ ముగ్గురు హీరోలకు భారత ప్రభుత్వం (Govt of India) నోటీసులు జారీ చేసింది. వారికి నోటీసులు పంపినట్లు ప్రభుత్వ న్యాయవాది అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)కు నివేదించారు. వారికి నోటీసులు అందిన విషయం రెండు నెలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read గడ్డం తీసేస్తున్నారా.. రేపు తిరుమలకు తెలంగాణ మంత్రి ఉత్తమ్

సినీ ప్రముఖులు హానికారక ఉత్పత్తులకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మోతీలాల్ యాదవ్ (Mothilal Yadav) అనే న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రనటులు ఆ ప్రకటనల్లో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు (Awards) అందుకున్న నటులు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదు’ అని మోతీలాల్ యాదవ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన న్యాయస్థానం మోతీలాల్ యాదవ్ వాదన సరైనేదనని భావించి.. అతడి అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం వెలువడి నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పిటిషనర్ మోతీలాల్ యాదవ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

Also Read ట్రాఫిక్ లో చిక్కుకున్న తెలంగాణ సీఎం కాన్వాయ్

తమ ఆదేశాలకు స్పందన రాకపోవడంతో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు (Notice) జారీ చేసింది. వీటికి స్పందించిన భారత ప్రభుత్వ తరఫు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే శుక్రవారం కోర్టులో సమాధానం ఇచ్చారు. ‘ఈ కేసులో అక్టోబర్ 22వ తేదీన అక్షయ్, షారూక్, అజయ్ లకు షోకాజ్ (Show Cause) నోటీసులు జారీ చేశాం’ అని కోర్టులో ఎస్బీ పాండే తెలిపారు. ఇక అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) గుట్కా వ్యవహారాల ప్రకటనల నుంచి వైదొలిగారని.. అయితే గుట్కా కంపెనీ మాత్రం అతడితో ఉన్న ప్రకటనను ప్రసారం చేసిందని కోర్టుకు వివరించారు. కాగా గుట్కా ప్రకటనల్లో ప్రముఖులు నటించడంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ కొనసాగుతోందని.. ఈ పిటిషన్ రద్దు చేయాలని ఎస్బీ పాండే కోరారు. అతడి వాదనలు విన్న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విచారణను వచ్చే ఏడాది 8వ తేదీకి వాయిదా వేసింది.

కాగా అక్టోబర్ 22నే నోటీసులు అందించినా ఇప్పటివరకు వెలుగులోకి (Out) రాకపోవడం గమనార్హం. గుట్కా వాణిజ్య ప్రకటనల్లో సినీ ప్రముఖులు నటించడం తరచూ వివాదం ఏర్పడుతోంది. ఆ ప్రకటనల్లో నటించడం ద్వారా ప్రజలకు గుట్కా తినమని చెబుతున్నట్లు ఉందని గతంలో చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. సినీ ప్రముఖులు చెడు వ్యసనాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల గేమింగ్ (Gaming), బెట్టింగ్ యాప్ (App)ల ప్రకటనల్లో నటించిన వారికి కూడా నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఇకపై వాణిజ్య ప్రకటనలు అంటేనే సినీ నటీనటులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button