తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Jayadev: రాజకీయాల నుంచి తప్పుకుంటున్న… గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. టీడీపీలో కీలక నేత జయదేవ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండుసార్లు ఎంపీగా గెలిచి, ప్రస్తుతం ఎంపీగా గుంటూరు ప్రజలకు ఆయన సేవలందిస్తున్నారు. రాజకీయాలు ఒకసారి వదిలేస్తే మళ్లీ రావడం కష్టమని కొందరు అంటున్నారని ఆయన అన్నారు. అవకాశం అంటూ మళ్లీ వస్తే పోటీ చేస్తానని తెలిపారు.

Also Read: రచ్చ లేపుతున్న నాగబాబు ట్వీట్… పొత్తు చివరి వరకు నిలిచేనా?

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడే గల్లా జయదేవ్.. తన తల్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు సేవచేశారు. ఆయనకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సినీనటుడు కృష్ణ పెద్దల్లుడు, హీరో మహేశ్ బాబుకు గల్లా జయదేవ్ స్వయానా బావ. ఎంపీగా రెండు పర్యాయాలు గెలుపొందినా గల్లా జయదేవ్.. ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు.

Also Read: నా ధైర్యం మీరే.. జగన్ జన సునామీ!

ఈ క్రమంలోనే గుంటూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుంటే పరవాలేదని, అవి దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం ఇబ్బంది పడతామని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. రాముడు పథ్నాలుగు ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగి వచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. అలాగే తాను కూడా తిరిగి వస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button