తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Naga Babu: రచ్చ లేపుతున్న నాగబాబు ట్వీట్… పొత్తు చివరి వరకు నిలిచేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగతారో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి జంప్ అవుతారో అర్థం కావడంలేదు. దీనికి టీడీపీ, జనసేన పొత్తే ఉదాహరణ అని చెప్పవచ్చు. గత రెండు రోజుల ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: మంత్రివర్గంలోకి ప్రొఫెసర్ కోదండరాం… సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఇదేనా!

టీడీపీ పలు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిందని… సమాచారం లేకుండా, తమతో చర్చించకుండా.. అభ్యర్థలను ప్రకటించడంతో జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందని మండిపడ్డారు. నారా లోకేష్ సీఎం పదవి పై మాట్లాడినా కూడా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని జనసేనాని అన్నారు.

Also Read: సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా

పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్వీట్‌ చేశారు. న్యూటన్‌ మూడో సూత్రాన్ని గుర్తు చేస్తూ చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు పై టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అన్న అని కూడా చూడకుండా నాగబాబు, ఆయన కూతురు విడాకులపై సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారు.

Also Read: గుడ్ న్యూస్..రేషన్‌కార్డు ఈ-కేవైసీ గడువు పొడగింపు

టీడీపీ అధిష్టానం ఆదేశం లేనిదే ఆ పార్టీ సోషల్ మీడియా ఇలాంటి పోస్ట్ చేయదని జనసేన క్యాడర్ మండిపడుతున్నారు. దీనిపై జనసేన సోషల్ మీడియా షాక్ అయినట్లు తెలుస్తుంది. టీడీపీని చూసి ఇలాంటి వాళ్లతో తమకి పొత్తు ఎందుకని జనసేన భావిస్తుందని సమాచారం. చూడాలి మరి టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదా వీరి మధ్య విభేదాలు ముదిరి పెద్దవై పొత్తుల వ్యవహారం మధ్యలోనే విగిపోతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button