తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని జగన్ చెప్పాడా, లేదా? అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నాడా లేదా? అని ప్రశ్నించారు. గెలిచాక ఎందుకు మాట మార్చావ్? అని నిలదీశారు. ఆ తర్వాత మూడు రాజధానులు అన్నాడు… ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ ను నాలుగో రాజధాని అంటున్నాడు అని ఎద్దేవా చేశారు. బిచ్చమెత్తుకుంటే ఎవరైనా ఆస్తిలో వాటా ఇస్తారా? హైదరాబాద్ పది సంవత్సరాలు మాత్రమే ఉమ్మడి రాజధాని అని తెలిపారు.

Also Read: పట్నం సునీతారెడ్డికి షాక్… అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జెడ్పీటీసీలు

వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. మరో 52 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదం అని పేర్కొన్నారు. జగన్ కు అభ్యర్థులు దొరక్క దిక్కుతోచని స్థితిలో పడ్డారని చంద్రబాబాబు ఎద్దేవా చేశారు. జగన్… రాజకీయాలను కలుషితం చేశారని విమర్శించారు.

5 Comments

  1. It’s actually a great and useful piece of information. I am happy that you simply shared this helpful info with us.
    Please stay us up to date like this. Thanks for sharing.

    My website vpn 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button