తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Velugonda: శరవేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు… జాతికి అంకితమిచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం

ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని ప్రజల కలలను నెరవేర్చడానికి వెలిగొండ ప్రాజెక్టు­ను పూర్తి చేసి ఫలాలను అందించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంది. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సొరంగం పనులను శరవేగంగా పూర్తి చేయడానికి శ్రమిస్తుంది. దాదాపు పూర్తి కావడానికి వచ్చిన రెండో సొరంగం పనులు ఇంకా 78 మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read:  కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డులు.. రూ.25లక్షల వరకు ప్రీ ట్రీట్‌మెంట్

శరవేగంగా పనులు పూర్తి

ఈ ఏడాదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు తరలించి తొలి దశ పూర్తి చేసే దిశగా పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్‌ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టి పడియ కాలువ ద్వారా 9,500, గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయర్‌ ద్వారా 3,500, రాళ్లవాగు ద్వారా 1,500) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో దివంగత వైఎస్సార్‌ 2004 అక్టోబర్‌ 27న వెలిగొండకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టుకు 3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులను పూర్తి చేశారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్… పోలీసుల నిఘా నీడలో పబ్బులు

జాతికి అంకితం చేసే యోచనలో ప్రభుత్వం

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివంగత వైఎస్సార్‌ చేపట్టిన వెలిగొండను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగు­లు వేస్తున్నారు. గత సర్కారు అంచనా వ్యయం పెంచిన రెండో సొరంగంలో మిగిలిన పనులను రద్దు చేసిన సీఎం జగన్‌ వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. నాడు టీడీపీ సర్కార్‌ నిర్దేశించిన ధరల కంటే 61.76 కోట్లు తక్కువ వ్యయంతో పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ. సొరంగం పనులను అప్పగించారు. శరవేగంగా పనులను పూర్తిచేసి 21 జనవరి 2024 న జాతికి అంకితం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button