తెలుగు
te తెలుగు en English
జాతీయం

Kejriwal: అరెస్ట్ చేయనంటే.. ఈడీ విచారణకు సిద్ధం: సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. కోర్టు గనుక తనకు ఈడీ అరెస్ట్‌ చేయదని అభయం ఇస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.

ALSO READ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అభిషేక్ బోయినపల్లికి బెయిల్

అరవింద్ కేజ్రీవాల్ తరఫున పిటిషన్‌లో విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఈడీ (ED) కఠిన చర్యలు తీసుకోకూడదని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హాజరు కావాలంటూ ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తొమ్మిదిసార్లు సమన్లు జారీ అయ్యాయి. సమన్ల ఉల్లంఘన కింద ఈడీ సైతం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేయగా.. ఆయన బెయిల్‌ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button