తెలుగు
te తెలుగు en English
జాతీయం

PM Modi: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నిక.. ప్రధాని మోడీ ఫోన్

రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్లపాటు ఆయన రష్యా అధ్యక్షుడిగా ఉండనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పుతిన్ కి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. ఇరువురు నేతలు భారత్- రష్యా దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Also read: Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అభిషేక్ బోయినపల్లికి బెయిల్

రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో రష్యాతో భారతదేశ బంధాన్ని మరింత లోతుగా విస్తరించడానికి మేము కలిసి పనిచేయాలని నిర్ణయించాము అని మోడీ ట్వీట్ చేశారు. ముందుగా పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. దాదాపు 87.17 శాతం ఓట్లను సాధించి ఘనవిజయం సాధించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ 4.1 శాతం ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో పుతిన్ కు మరింత మెజార్టీ పెరిగింది. 2018 ఎన్నికల్లో 76.69 శాతం ఓట్లు సాధించారు. పుతిన్ రష్యాకి నాలుగుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button