తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: కేటీఆర్ ఆసక్తికర ట్వీట్… ఇది నిజమో? కాదో? మీరే చెప్పండి!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆసక్తికర X ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తనకు చాలా మంది రకరకాల ఫీడ్‌బ్యాక్‌లు, పరిశీలనలు పంపుతున్నారని తెలిపారు. అలా తనకు అందిన ఫీడ్‌బ్యాక్స్‌లో బెస్ట్‌ అనిపించిన ఒక దాన్ని నెటిజన్లతో ట్విట్టర్‌ వేదికగా ఆయన పంచుకున్నారు.

Also Read: రేషన్‌కార్డుల ఈ-కేవైసీ పై కీలక ఆప్డేట్… చివరి తేదీ ప్రకటన

కేసీఆర్‌ 32 గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసే బదులు… ఫేక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టాల్సిందని తనకు వచ్చిన ఒక అబ్జర్వేషన్‌ను నెటిజన్లతో కేటీఆర్‌ షేర్‌ చేసుకున్నారు. దీనితో తాను కూడా ఏకీభవిస్తున్నానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Also Read:  ప్రజాపాలన.. మూడు రోజుల్లో దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే?

డిసెంబర్ 3వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ 39 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది. సీఎం రేవంత్‌తో పాటు ఇటు మాజీ మంత్రులు హరీష్‌ రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. అధికార పార్టీ శ్వేత పత్రం పేరుతో, ప్రతిపక్ష పార్టీ స్వేద పత్రం పేరుతో పోటాపోటీగా ప్రకటనలు చేశాయి. ఇక సోషల్‌ మీడియా వేదికగానూ సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button