తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

R.Narayanamurthy: నేడు పీపుల్స్ స్టార్ పుట్టినరోజు

ఆర్ నారాయణమూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు,నిర్మాత, సంగీత దర్శకుడు, గీత రచయిత. ఇతను 1953 డిసెంబరు 31న తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. తెలుగు సినిమారంగంలో ఎర్రసైన్యం సినిమా ఒక ట్రెండ్ ను సృష్టించింది. అర్ధరాత్రి స్వాతంత్య్రం, భూపోరాటం, లాల్ సలామ్, దండోరా, చీమలదండు, దళం వంటి మూవీలు నారాయణమూర్తికి మంచి పేరు తీసుకొచ్చాయి.

Also Read: ఇది మీరు గమనించారా?… గూగుల్ కొత్త డూడుల్ ఎలా ఉంది?

దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నటించిన ఒరేయ్ రిక్షా సూపర్ హిట్టయింది. ఆ సమయంలోనే పీపుల్స్ స్టార్ అని బిరుదునిచ్చారు దాసరి. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆర్. నారాయణ పూర్తి ప్రజాసమస్యలపై తన చిత్రాల ద్వారా పోరు సాగిస్తూనే ఉన్నారు. 1986 నుండి 2018 వరకు నారాయణ మూర్తి నుండి 29 సినిమాలు వచ్చాయి. విప్లవ సినిమాలు, ప్రజలను చైతన్యపరిచే సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పీపుల్స్ స్టార్ కు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button