తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

HMDA: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. అక్రమంగా వేసిన కాలేజీ రోడ్డు తొలగింపు

మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన.. రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో పది గంటల స్థలం సుమారు 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి.. రోడ్డు నిర్మాణం చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

Also read: CM Jagan: సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. పవన్ పై పోటీకి సీనియర్ నేత?

కాలేజీ కోసం మాజీ మంత్రి రోడ్డును వేశారు. అయితే ఈ వ్యహారంపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో శనివారం హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button