తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Premalu: ‘ప్రేమ‌లు’ మూవీ అప్‌డేట్.. ట్రైల‌ర్ ఎప్పుడంటే?

మ‌ల‌యాళంలో చిన్న సినిమాగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న చిత్రం ‘ప్రేమ‌లు’. ఈ మూవీని రూ.11 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవ‌లం 15 రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాను తెలుగులో టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు నడుస్తున్నాయి. తాజాగా, మేకర్స్ సినిమాపై అప్డేట్ ప్రకటించారు.

ALSO READ: ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సందడి.. వీడియో వైర‌ల్

వీఎన్‌ఆర్‌లో ట్రైలర్ లాంచ్..

ఈ సినిమా ట్రైల‌ర్‌ను హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు లాంచ్ చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. ఇక తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో చూడాలి. ముఖ్యంగా ఈ సినిమాలో వ‌చ్చే చార్మినార్, ట్యాంక్‌బండ్, తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం సీన్స్ అయితే మూవీకే హైలెట్ అని చెబుతున్నారు. మనం రోజు తిరిగే హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా? అనేలా తీసినట్లు సమాచారం. కాగా, ఈ సినిమా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button