తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TSRTC: దేశానికే రోల్ మోడల్‌.. టీఎస్‌ఆర్టీసీకి అవార్డుల పంట

టీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు సంస్థకు వరించాయి. 2022–23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. ఈ ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈనెల 15న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది.

ALSO READ: ఒంటరిగానే బరిలోకి దిగనున్న బీజేపీ?

టీఎస్‌ఆర్టీసీకి 5 అవార్డులు

జాతీయ స్థాయ అవార్డుల్లో సత్తాచాటి ప్రజా రవాణాలో టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ అందించే ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో సంస్థకు 5 అవార్డులు వచ్చాయని, రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌ విభాగంలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button