తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Kumari Aunty: సీఎం రేవంత్ కు ఇష్టమైనవి వండి పెడతా.. కుమారి ఆంటి కామెంట్స్

మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు కుమారి ఆంటీ. ఒక సాధారణ ఫుడ్ స్టాల్ నడిపే మహిళ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంచి భోజనం తక్కువ ధరకు అందించిందని ఫేమస్ చేస్తే.. చివరికి ఆ ఫేమస్ కారణంగానే ఆమె స్టాల్ ను మూసివేసే పరిస్థితి వచ్చింది. ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు వచ్చే కస్టమర్లతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు ఆమె స్టాల్ ను సీజ్ చేశారు. అంతేకాకుండా వారి కుటుంబంతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కొడుకును కొట్టారు. ఇక ఇది అన్యాయమని ప్రతిఒక్కరు చెప్పడంతో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కుమారి ఆంటీ ఘటన తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తానని చెప్పారు.

Also read: Lakshadweep: పర్యటక రంగంపై కేంద్రం ఫోకస్.. టూరిస్ట్ హబ్ గా లక్ష్యద్వీప్

ఇక తాజాగా ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ” బుధవారం 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. బండిని సీజ్ చేశారు. మా కొడుకును పోలీసులు కొట్టారు. మళ్లీ హోటల్ తెరుస్తామని అసలు అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ మహిళ పై సీఎం స్పందించడం గొప్ప విషయం. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన వస్తే ఇష్టమైనవి అన్నీ వండి పెడతా” అని కుమారి ఆంటీ తెలిపింది. ఇక త్వరలోనే రేవంత్ రెడ్డి.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నారు. ఇదే కనుక జరిగితే ఆమె రేంజ్ మారిపోతుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం రేవంత్ రెడ్డి మంచి మనసుతో ఆమె హోటల్ పెట్టుకొనేలా పర్మిషన్ ఇప్పిస్తే బావుంటుందని, ఇలాంటివి జరగవని చెప్పుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button