తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

LRS: హామీలు ఇవ్వడం…మాట మార్చడం…కాంగ్రెస్‌కు అలవాటే: హరీష్ రావు

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైందని ఆరోపించారు.

Also Read: ప్రతిష్టాత్మకంగా గగన్‌యాన్ ప్రాజెక్టు… వ్యోమగాములను కలిసిన మోదీ

నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని సూచించారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button