తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Actor Lena: వ్యోమగామిని వివాహమాడిన హీరోయిన్..ఎవరంటే?

గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో టీమ్‌లీడ‌ర్‌గా ఉన్న ఫైట‌ర్ పైలెట్, వ్యోమగామి ప్ర‌శాంత్ బాల‌కృష్ణ‌న్ నాయ‌ర్‌ను ఓ నటి వివాహమాడింది. మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ దేశానికి న‌లుగురు వ్యోమగాములను ప‌రిచ‌యం చేశాడు. కేర‌ళ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌శాంత్‌తో పాటు మ‌రో ముగ్గురు వ్యోమ‌గాములను వెల్లడించారు. తర్వాత దీనిపై మ‌ల‌యాళ న‌టి లీనా ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ALSO READ: రైతుల ఖాతాల్లో మూడో విడత పెట్టు­బడి సాయం.. ఇది ఐదోసారి!

పెద్ద‌లు కుదిర్చిన వివాహం..

వ్యోమగాముల్లో ఒకరైన ప్ర‌శాంత్ బాల‌కృష్ణ‌న్ నాయ‌ర్ త‌న భ‌ర్తే అని న‌టి లీనా ప్ర‌క‌టించింది. ఇక ఇస్రో చైర్మెన్ ఎస్ సోమ‌నాథ్‌తో దిగిన ఫోటోను కూడా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే త‌న పెళ్లి విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచాల‌ని ఎవరికి చెప్పలేదన్నారు. మేము ఈ ఏడాది జ‌న‌వ‌రి 17వ తేదీన పెళ్లి చేసుకున్నమాని, మాది పెద్ద‌లు కుదిర్చిన వివాహమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button