తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: రైతుల ఖాతాల్లో మూడో విడత పెట్టు­బడి సాయం.. ఇది ఐదోసారి!

రైతులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద మూడో విడత పెట్టు­బడి సాయం ఇవాళ విడుదల చేయనున్నారు. అయితే దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ కింద నగదును జమ చేయనున్నారు. ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవా­రం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ALSO READ: పిఠాపురానికి మకాం మార్చిన పవన్..!

రూ.1,294.34 కోట్ల సాయం

ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ల పాటు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం సీఎం జగన్ అందిస్తున్నారు. ఈ మేరకు వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేశారు. మూడో విడత కింద 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.1,078 కోట్లను బుధవారం జమ చేయనున్నారు. అలాగే సున్నా వడ్డీ రాయితీ కింద 10.79లక్షల మంది ఖాతాల్లో 215.78 కోట్లను జమ చేయనున్నారు. దీంతో ఈ రెండు పథకాలకు సంబంధించి మొత్తం అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు.

ALSO READ: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో నగదు జమ

దేశంలోనే ఆదర్శం

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వో­ఎఫ్‌ఆర్‌ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ‘వైఎస్సార్‌ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. కాగా, ఎన్నికల్లో ఎడాదికి రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న జగన్.. రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేయడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button