తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Minister Komatireddy: కేంద్రమంత్రిని కలుస్తా.. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెడుతోంది. మెల్లమెల్లగా పాలనలో వేగం పెంచుతోంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే పనిలో పడింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన ఛాంబర్ లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also read: CM Revanth Reddy: మాజీ సీఎం వద్దకు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా

అనంతరం పెండింగ్ లో ఉన్న రోడ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేడు తొమ్మిది అంశాలపై సంతకం చేశానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అందులో ఒకటి నల్గొండ- ముసంపల్లి, ధర్మారం రోడ్డు వెడల్పు ఫైల్ ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ లోని చాలా రాడ్లు బాగాలేవని.. వాటిపై దృష్టి పెడుతున్నామన్నారు. త్వరలోనే ఎల్బీనగర్- మల్కాపూర్ రోడ్డును పూర్తి చేస్తామన్నారు.

అందులో భాగంగా డిసెంబర్ 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని చెప్పారు. హైదరాబాద్- విజయవాడ హైవేను 6 లైన్లు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామన్నారు. హైదరాబాద్- కల్వకుర్తి వరకు 4 లైన్ రోడ్ల నిర్మాణం గురించి అడుగుతామన్నారు. గత 10 ఏళ్లలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని విమర్శించారు. సెక్రటేరియట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో అవకతవకలు జరిగితే అందుకు విచారణ చేపిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button