తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Suryapet: కాంగ్రెస్ కు జోష్.. పటేల్ రమేశ్ నామినేషన్ ఉపసంహరణ

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు (Wave) వీస్తున్నాయి. సర్వేలన్నీ హస్తం పార్టీకే మొగ్గు చూపగా.. ప్రజలు కూడా ఆ పార్టీకే అండగా నిలుస్తున్నారు. ఇక నాయకులు (Leaders) కూడా కాంగ్రెస్ జెండాను వీడకుండా వెన్నంటే ఉంటున్నారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు వెనక్కి తగ్గుతున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన సూర్యాపేట సెగ్మెంట్ లో పార్టీ రెబల్ అభ్యర్థి పటేల్ రమేశ్ రెడ్డి (Patel Ramesh Reddy) నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అతడి నిర్ణయంతో సూర్యాపేటలో (Suryapet) కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: 6 గ్యారంటీలు అదుర్స్.. మా ఓటు కాంగ్రెస్ కే అంటున్న ప్రజలు

సూర్యాపేట టికెట్ ను సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డికి (Ramreddy Damodar Reddy) పార్టీ అధిష్టానం ప్రకటించడంతో మనస్తాపం చెందిన రమేశ్ రెడ్డి రెబల్ (Rebel) అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. అతడిని పోటీ నుంచి విరమించుకునేలా పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, మల్లు రవి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. మీ భవిష్యత్ కు సంబంధించి పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు.

Also Read: అర్ధరాత్రి కలకలం.. మధుయాష్కీ నివాసంలో పోలీసుల తనిఖీలు

స్పష్టమైన హామీ కోసం రమేశ్ రెడ్డి పట్టుబట్టడంతో పార్టీ నాయకులు చర్చించి ఎంపీ (Member of Parliament) టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ నాయకుల చొరవతో రమేశ్ రెడ్డి నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు (Withdraw). పార్టీ కోసమే నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు రమేశ్ రెడ్డి మీడియాతో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button