తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Visakha: ఆటల్లో 3 స్వర్ణాలు కైవసం.. 101 ఏళ్ల వృద్ధుడి అద్భుతం

విశాఖకు చెందిన ఓ వృద్ధుడు అద్భుతం చేశాడు. 101 ఏళ్ల వయస్సులో ఆటల పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఏకంగా 3 స్వర్ణాలు కైవసం చేసుకుని అందరినీ ఔరా అనిపించాడు.

Read also: Salaar: సలార్ మూవీ ప్రమోషన్స్.. రంగంలోకి బెంగళూరు ఐపీఎల్ టీం

ఫిలిప్పిన్స్ వేదికగా 22వ ఆసియా మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఈనెల 8 నుంచి 12 వరకు నిర్వహించారు. ఇందులో 95-99 ఏళ్ల మధ్య వారికి జావెలిన్ త్రో, షార్ట్ పుట్ పోటీలు నిర్వహించారు. ఇక 85-89 ఏళ్ల వయస్సు వారికి 5 కి. మీ. నడక పోటీలు నిర్వహించారు. పోటీల్లో విశాఖకు చెందిన వి. శ్రీరాములు పాల్గొని ఈ మూడు పోటీల్లో విజేతగా నిలిచారు. ఈయన గతంలో నేవిలో పనిచేసి రిటైర్ అయ్యారు. 101 ఏళ్ల వయస్సులో పోటీల్లో పాల్గొని దేశానికి 3 స్వర్ణ పతకాలు తీసుకువచ్చారు. దీంతో శ్రీరాములుని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా ఈ పోటీలకు 22 దేశాల నుంచి 2 వేల మంది అథ్లెట్లు పాల్గొన్నారు. కాగా.. పోటీలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయనకు పలువురు ఘనస్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button