తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Prajapalana: ప్రజాపాలనకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ.. శివుడి పేరుతో అర్జీ

తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ శనివారం ముగిసింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. గత నెల 28 నుంచి జనవరి 6 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు అధికారులు. అభయహస్తం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రజాపాలనలో గృహలక్ష్మి, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు స్పష్టం చేశారు.

Also read: Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ కి డాక్టరేట్.. కానీ ఏమైందంటే?

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 24 లక్షల 75 వేల 3 వందల 25 దరఖాస్తులు స్వీకరించినట్టు అధికారులు చెప్పారు. అభయహస్తం కోసం 19 లక్షల 12 వందల 56 దరఖాస్తులు, ఇతర సేవల కోసం 5 లక్షల 73 వేల 69 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఇక సోమవారం నుంచి ఈ నెల 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ కార్యక్రమం చేపడతామన్నారు.

ఇక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో విచిత్ర ఘటన జరిగింది. ప్రజాపాలనలో శివుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో అభయహస్తానికి ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అప్లై చేశారు. దరఖాస్తుదారుడి పేరు శివుడు, భార్య పేరు పార్వతి, కుమారుల పేర్లు వినాయకుడు, కుమారస్వామిగా రాశారు. గృహలక్ష్మి, గృహజ్యోతితోపాటు ఇతర పథకాలకు అప్లై చేశారు. దేవుడు పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తు రావడంతో గ్రామస్తులంతా అవాక్కవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button