తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

AR Rahman: RC16 నుంచి ఆసక్తికర అప్ డేట్… కొత్త పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా అనంతరం ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాంచరణ్ 16 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా రోజుల ముందే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రబృందం అప్ డేట్ ఇచ్చారు.

Also Read: తండేల్ నుంచి కీలక అప్డేట్.. గ్లింప్స్ విడుదల

నేడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా త్వరలో తెరకెక్కనున్న RC16 సినిమాకి ఆయన సంగీతం అందించబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ రామ్ చరణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ మూవీకి రహమాన్ వర్క్ చేస్తున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది.

Also Read: ఓటిటిలోకి వచ్చేస్తున్న ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కిలారు వెంకట సతీశ్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి షురూ కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. గేమ్ ఛేంజర్ సెట్స్ పై ఉండగానే మరో సినిమా గురించి అప్ డేట్ రావడంతో మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button