తెలుగు
te తెలుగు en English
జాతీయం

One Nation One Election: జమిలి ఎన్నికలు… సలహాలు, సూచనలు కోరిన కమిటీ

దేశంలో లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న ఉద్దేశంతో కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా గణనీయంగా ఖర్చు తగ్గుతుందన్నది కేంద్రం భావన.1952లో స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి 1967 వరకు ఇలాగే ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. దీనిపై సమగ్ర అధ్యయనం కోసం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్, ఎన్ కె సింగ్, సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారీ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా న్యాయశాఖ మంత్రి, కమిటీ కార్యదర్శిగా న్యాయశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.

Also Read: జనసేనాని పవన్ కల్యాణ్ కి డాక్టరేట్.. కానీ ఏమైందంటే?

ఇప్పటికే ఈ కమిటీ పని ప్రారంభించి రెండు సార్లు సమావేశమైంది. వివిధ వర్గాలను కలుస్తూ అభిప్రాయసేకరణ జరుపుతోంది. రాజకీయ పార్టీలను, న్యాయ కమిషన్ ను కూడా కలిసింది. తాజాగా, ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం పలికింది. దేశంలో ఒకేసారి పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు జరపడంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోవింద్ కమిటీ తెలిపింది.

Also Read: అన్న క్యాంటీన్ ను సందర్శించిన చంద్రబాబు.. పార్టీ జెండా ఆవిష్కరణ

ప్రజలు తమ సూచనలు, సలహాలను onoe.gov.in వెబ్ పోర్టల్ ద్వారా, sc-hlc@gov.in మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ చేయడం ద్వారా తెలియజేయవచ్చని కమిటీ వివరించింది. ప్రజలు తమ అభిప్రాయాలను జనవరి 15 లోపు తెలియజేయాలని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button