తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Health Bulletin: విరిగిన ఎముక.. 2 నెలలు మంచానికే కేసీఆర్

కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. శస్త్ర చికిత్స (Operation) చేయడంతో దాదాపు 6 నుంచి 8 వారాల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని హెల్త్ బులెటిన్ (Health Bulletin)లో పేర్కొన్నారు. ప్రస్తుత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

Also Read మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆందోళనలో పార్టీ నాయకులు

ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ (Farm House)లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం బాత్రూమ్ లో కాలు జారి కిందపడ్డారు. వెంటనే అర్ధరాత్రి హైదరాబాద్ (Hyderabad) సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. ‘ఎడమ కాలి తుండి ఎముక విరిగింది.. దాన్ని మార్పిడి చేయాలి. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల (Doctors) పర్యవేక్షణలో కేసీఆర్ ఉన్నారు’ అని హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలిపారు.

Also Read బిల్లు కడుతారా.. మాల్ మూసేయాల్నా? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ (Narendra Modi) ఆరా తీశారు. ‘మాజీ సీఎం కేసీఆర్ కు గాయం కావడం బాధ కలిగించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని పంపి ఆస్పత్రి వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకుంది. కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button