తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Diwali ఏపీ మాదిరే తెలంగాణ.. దీపావళి సెలవులో మార్పు

దీపావళి పండుగ సెలవుపై ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) స్పష్టత ఇచ్చింది. పండుగ ఆదివారం కాదు సోమవారం అని వేదాంతులు నిర్ణయించడంతో ప్రభుత్వం పండుగ సెలవులో (Holiday) మార్పు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు (GO) జారీ చేశారు.

Read Also కోహ్లీ-అనుష్క ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? మరో గుడ్ న్యూస్ ఉంటుందా?

ఈనెల 13న సోమవారం సాధారణ సెలవుగా పరిగణిస్తూ శుక్రవారం ప్రకటన వెలువడింది. ఆ రోజు తెలంగాణలో పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. కాగా, ఏపీ (AP) ప్రభుత్వం కూడా సెలవును మార్చిన విషయం తెలిసిందే. సోమవారం నాడే దీపావళి సెలవు ప్రకటించింది. తరచూ హిందూ పండుగల విషయంలో గందరగోళం ఏర్పడుతోంది.

పండుగలలో గందరగోళం
ఇటీవల రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దసరా పండుగల విషయంలో ఏర్పడగా పండితులు, వేదాంతాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వారికి వీలైన రోజు పండుగ (Festival) చేసుకున్నారు. కాగా, తాజాగా దీపావళి విషయంలో అదే గందరగోళం (Confusion) కొనసాగుతోంది. ఆంగ్ల క్యాలెండర్ లో ఒకలా ఉండగా.. తెలుగు సంవత్సరం ప్రకారం మరో రోజు పండుగ ఉంటుంది. అయితే విధులు, తిథుల ప్రకారం పండితులు పండుగను నిర్ణయించారు. వారి ప్రకారం సోమవారం పండుగ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also హీరోయిన్ రష్మికకు మరో షాక్.. మళ్లీ రెచ్చిపోయిన ఆకతాయిలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button