తెలుగు
te తెలుగు en English
సినిమా

Deepfake Video హీరోయిన్ రష్మికకు మరో షాక్.. మళ్లీ రెచ్చిపోయిన ఆకతాయిలు

సాంకేతిక పరిజ్ణానాన్ని (Technology) ఆసరాగా చేసుకుని ఆకతాయిలు వెర్రివేషాలు వేస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలు చేస్తూ ప్రముఖులను అభ్యంతరకరంగా చూపిస్తున్నారు. ఇటీవల సినీ తార రష్మిక మందాన్న (Rashmika Mandanna) ఉదంతం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మరోసారి రష్మికను లక్ష్యంగా చేసుకుని మరో వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలు రష్మికకు తలనొప్పిగా మారాయి.

తాజాగా విడుదలైన వీడియోలో (Deepfake Video) హీరోయిన్ రష్మిక జిమ్ సూట్ ధరించి డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. ఈ వీడియో రష్మికకు సంబంధించినది కాదని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఈ వీడియో రూపొందించిన వారిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి వీడియోలు వస్తుండడంతో రష్మిక అసహనం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం (Govt of India) అలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రెండు రోజులకే మరో వీడియో విడుదల కావడం గమనార్హం. కాగా రష్మికను లక్ష్యంగా చేసుకుని కొందరు చేస్తున్న ఈ పనిని సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. రష్మికకు సంఘీభావం తెలిపి నీకు మేమున్నామనే భరోసా ఇస్తున్నారు.

చదవండి: Telangana ఎన్నికలకు హీరోయిన్ సౌందర్యకు ఏం సంబంధం? మీకు తెలుసా?

ఇటీవల జారా పటేల్ (Jara Patel) వీడియోకు రష్మిక ముఖం పెట్టి డీప్ ఫేక్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోతో రష్మిక మనస్తాపానికి గురైంది. ఈ చర్యను సినీ నటులు అమితాబ్ బచ్చన్, కీర్తి సురేశ్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య ఇతర సినీ ప్రమఖులతో పాటు తెలంగాణ నాయకులు కేటీఆర్, కవిత తదితర వ్యక్తులు ఖండించారు. కేంద్ర ఐటీ శాఖ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖులతో పాటు రష్మిక అభిమానులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button