తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… టీఎస్ఆర్టీసీలో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కసరత్తు

చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 3 వేల పోస్టుల భర్తీ చేయనుంది. ప్రత్యేకంగా ఇటీవల ఏర్పాటు చేసిన రూట్లు, కొనుగోలు చేస్తున్నా కొత్త బస్సులలో సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ రిక్రూట్ మెంట్ చేపడుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు రిక్రూట్ మెంట్ ను చేపట్టనున్నట్లు సీనియర్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Also Read: సోషల్ మీడియా వదంతులను నమ్మద్దు… విద్యుత్‌కు ఎలాంటి కొరత లేదు: భట్టి

ఇటీవల టీఎస్ ఆర్టీసి 813 బస్సు, కండక్టర్లు, డ్రైవర్ల పోస్టుల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు వెల్లడించింది.ఇటీవల మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల నుంచి అర్హలైన 50 మందికి అపాయింట్ మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. కారుణ్య నియామకాలతో పాటు అదనపు నియామకాలు చేపడతామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీఎస్ ఆర్టీసీకి హామీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button