తెలుగు
te తెలుగు en English
జాతీయంప్రత్యేక కథనం

Diwali: కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?

కొర‌డా దెబ్బ‌లు అంటేనే మ‌న‌కు అది ఒక శిక్ష‌గా గుర్తుకు వ‌స్తుంది. మ‌రి అలాంటి కొర‌డా దెబ్బ‌లు ఒక‌ ముఖ్య‌మంత్రి (Chief Minister) తిన్నారు. వేలాది మంది ప్ర‌జ‌ల మ‌ధ్య సీఎం కొర‌డా దెబ్బ‌లు కొట్టించుకున్నారు. ఈ వార్త నెట్టింట్లో వైర‌ల్ (Viral)గా మారింది. ఆ ముఖ్య‌మంత్రి ఎవ‌రు? ఎందుకు దెబ్బ‌లు తిన్నారో తెలుసుకోండి.

చత్తీస్ గ‌డ్ (Chhattisgarh)లోని దుర్గ్ జిల్లా (Durg District) జాంజ్ గీర్ లో దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతాయి. ఈ సంద‌ర్భంగా గోండు ప్ర‌జ‌లు నిర్వ‌హించిన గౌర గౌరీ పూజ‌కు సీఎం భూపేశ్ బ‌ఘెల్ (Bhupesh Baghel) హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల మాదిరి సీఎం బ‌ఘెల్ కూడా కొర‌డాతో దెబ్బ‌లు తిన్నారు. ముఖ్య‌మంత్రిని కొర‌డాతో కొట్టేందుకు నిర్వాహ‌కులు మొద‌ట జంకారు. కానీ సీఎం కొట్ట‌మ‌ని కోర‌డంతో స‌ర‌దాగా వారు కొర‌డాతో కొట్టారు. సమాన‌త్వాన్ని సూచించే ఈ పూజ‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం తాను పాల్గొన్న‌ట్లు సీఎం బ‌ఘెల్ తెలిపారు.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నిక‌ల (Assembly Elections) వేళ సీఎం కొర‌డా దెబ్బ‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్నందుకు చేసిన పాపానికి కొర‌డా దెబ్బ‌లు తిన్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఎద్దేవా చేశాయి. పండుగను కూడా రాజ‌కీయం చేయ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) త‌ప్పుబ‌ట్టింది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న చ‌త్తీస్ గ‌డ్ లో ద‌శ‌ల‌వారీగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఫ‌లితాలు మాత్రం డిసెంబ‌ర్ 3వ తేదీన విడుద‌ల కానున్నాయి. మ‌రోసారి చ‌త్తీస్ గ‌డ్ లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని తెలుస్తోంది.

గౌర గౌరీ పూజ అంటే ఏమిటి?
గోండు తెగ ప్ర‌జ‌లు గౌరా గౌరీ పూజ (Gaura-Gauri Pooja) నిర్వ‌హిస్తారు. అంటే తొలి రోజు న‌ది (River) ఒడ్డుకు వెళ్ళి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా మట్టిని తీసుకువ‌స్తారు. అదే రోజు రాత్రి అదే మ‌ట్టితో ఒక‌రి ఇంట్లో శివుడిని.. మ‌రొక‌రి ఇంట్లో పార్వ‌తీదేవిని త‌యారు చేస్తారు. అనంత‌రం శివ‌పార్వ‌తుల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button