తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Direct-To-Mobile: ఇంటర్నెట్ లేకుండా వీడియోలు చూసేయొచ్చు.. ఎలాగంటే?

మొబైల్‌ యూజర్లకు మంచి శుభవార్త. ఇక సిమ్‌ కార్డు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండా వీడియోలను చూడవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల జరిగిన బ్రాడ్‌కాస్టింగ్ సమ్మిట్ కార్యక్రమంలో దీనికి సంబంధించిన విషయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీని ప్రస్తుతం 19 నగరాల్లో పరీక్షిస్తున్నామని, 470-582 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

ALSO READ: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఇద్దరు మృతి

మరింత వేగవంతం..

25-30 శాతం వీడియో ట్రాఫిక్‌ని డైరెక్ట్-టూ-మొబైల్ టెక్నాలజీకి మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌ మరింత వేగవంతంగా పనిచేస్తుందని, దేశీయ డిజిటలీకరణను వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని పెంచుతుందని అపూర్వ చంద్ర వివరించారు. గతేడాది డైరెక్ట్-టూ-మొబైల్‌ను బెంగళూరు, ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించారు. డైరెక్ట్-టూ-మొబైల్ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా దాదాపు 8-9 కోట్ల మందికి టెక్నాలజీ చేరువ కానుందని వెల్లడించారు. కాగా, డీటీహెచ్ తరహాలో పనిచేసే ఈ డైరెక్ట్-టూ-మొబైల్ టెక్నాలజీని బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌కాస్ట్ కలిపి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button