తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Ink: సిరా చుక్క ఎందుకు వేస్తారో తెలుసా? ఎక్కడ తయారవుతుందంటే..

ఎన్నికలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సిరా చుక్క. వేలిపై వేసే సిరా చుక్క (Indelible Ink) కొన్ని వారాలైనా చెరిగిపోదు. ఈ సిరా చుక్క ఎన్నికల్లో చాలా ప్రాధాన్యం కలిగింది. ఆషామాషీగా సిరాను వేయరు. ఈ సిరా చుక్క వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆ సిరా దేశంలో ఒక్క చోట మాత్రమే తయారుచేస్తారు. అత్యంత విలువైన ఆ సిరాకు విదేశాల్లో (Foreign Countries) భారీ డిమాండ్ ఉంది. అసలు సిరా కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.

అసలు ఉద్దేశం
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అత్యంత కీలకం. అలాంటి ఎన్నికల్లో (Elections) అక్రమాలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే దొంగ ఓట్ల నివారణ కోసం తీసుకొచ్చినదే సిరా చుక్క. ఓటేసిన వ్యక్తికి సిరా చుక్క వేయడం ప్రారంభించారు. ఓటేసినా వ్యక్తికి సిరా చుక్క ఉండడంతో అతడు మళ్లీ ఓటు వేయడానికి రాలేడు. దొంగ ఓట్ల నివారణకు సిరా చుక్క దోహదం చేస్తుంది.

Also Read తెలంగాణలో 2 రోజులు బడులు బంద్

ఎక్కడ తయారీ..?
చేతికి వేసే సిరా చుక్క దేశంలో ఒక్క చోట మాత్రమే తయారుచేస్తారు. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీలో సిరా తయారవుతుంది. ఆ కంపెనీకి 1962లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దశాబ్దాల నుంచి ఆ కంపెనీ మాత్రమే ఈ సిరా ఉత్పత్తి చేస్తుంది. దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఈ కంపెనీ నుంచే సిరా వెళ్తుంది.

సిరాలో ఏముంటుంది?
సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కాంతికి గురికావడం వలన సిరా చర్మానికి వెంటనే చెరిగిపోదు. మొదట గోరు పైభాగపు చర్మంపై వేసేవారు. అనంతరం 2006 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి గోరుపై సిరా వేస్తున్నారు.

Also Read అర్ధరాత్రి కలకలం.. మధుయాష్కీ నివాసంలో పోలీసుల తనిఖీలు

ప్రపంచ దేశాలకు ఎగుమతి
ఈ సిరా చుక్కకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. 1976 నుంచి మొత్తం 29 దేశాలకు ఈ సిరా చుక్క ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్, ఆప్ఘానిస్థాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా, లెబనాన్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూడాన్, సిరియా, టర్కీన ఈజిప్టు తదితర దేశాలకు సిరా ఎగుమతి చేస్తున్నారు. ఆ దేశాల్లో జరిగే ఎన్నికల్లోనూ మన సిరానే వినియోగిస్తున్నారు దేశంలో మరో సిరా కూడా ఉత్పత్తి చేస్తారు. అది హైదరాబాద్ లోనే. రాయుడు ల్యాబోరేటరీస్ లో తయారయ్యే సిరా 100కు పైగా ఆఫ్రికన్ దేశాలకు ఈ ఇంక్ ఎగమతి జరుగుతోంది. ఈ సిరాను తెలంగాణలో జరిగే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. దీనికి తోడు పోలియో చుక్కలు వేసినప్పుడు చిన్నారుల వేలికి కూడా సిరా రాస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button