తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Viral Video: న్యూ ఇయర్ వేళ వైరల్ వీడియో.. సలార్ డైలాగ్ వాడుకున్న పోలీసులు

దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాల కోసం ప్రజలు రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటి నుంచే వేడుకలు షురూ చేశారు. ఒక్కక్కరు ఓక్కోలా తమ అభిరుచికి తగ్గట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక ఈ రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై ప్రవహిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి మందు దావత్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పే మందుబాబులు ఎంతోమంది ఉంటారు. ఈ నేపథ్యంలో మందు బాబులకు హైదరబాద్ సిటీ పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ డైలాగ్ ను వాడుకుంటున్నారు.

Also read: Mumbai Police: న్యూ ఇయర్ వేళ కొత్త టెన్షన్.. ముంబైలో పోలీసులకు బెదిరింపు కాల్

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వచ్చే నష్టాలను తెలిపేలా సలార్ మూవీలోని ఓ డైలగ్ తో ఓ వీడియో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో హైదరబాద్ సిటీ పోలీస్ ఆ వీడియోను షేర్ చేసింది. అందులో సలార్‌ లో ప్రభాస్ డైలాగ్స్‌కు మ్యాచ్ చేస్తూ లిక్కర్, యాక్సిడెంట్ ఫొటోలను చూపించారు. “ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పాగా” ప్రభాస్‌ డైలాగ్‌ కు లిక్కర్ ఫొటోలు పెట్టి దాన్ని ముట్టుకోవద్దు అని అర్థం వచ్చేలా క్రియేట్ చేశారు. తర్వాత “ప్లీజ్ ఐ కైండ్‌ లీ రిక్వెస్ట్” అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని పేర్కొంటూ కారు ప్రమాదాలు జరిగిన విజువల్స్ ను చూపించారు. ఇలా సలార్‌లో ప్రభాస్ డైలాగ్స్‌ ను న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల క్షేమం కోసం పోలీసులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button