తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ISRO: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. న్యూ ఇయర్ రోజు నింగిలోకి రాకెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ న్యూ ఇయర్ రోజు మరో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్స్‌పో రాకెట్‌ను నింగిలోకి పంపించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకు అమెరికా మాత్రమే అంతరిక్షంలోకి పంపిన ఇలాంటి శాటిలైట్‌ను ఇప్పుడు ఇస్రో నింగిలోకి పంపనుంది. విశ్వంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందుతున్న కాంతిపుంజాల రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. దాదాపు 5 నెలలపాటు కక్ష్యలో తిరగనున్న ఎక్స్‌పో శాట్ కీలకమైన సమాచారాన్ని సేకరించేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది.

Also read: Ladies: మహిళలకు ఫ్రీ జర్నీ.. సీటు కోసం సిగపట్లు

చంద్రయాన్-3 విజయం తర్వాత అంతరిక్ష రంగంలో భారతదేశ ఖ్యాతి మరో స్థాయికి చేరుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరింత వేగంగా భవిష్యత్ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మొదటి రోజునే మరో కొత్త రాకెట్‌ను నింగిలోకి పంపించనుంది. జనవరి 1న ఎక్స్‌పో శాట్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్.. వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది.

ఖగోళంలో కృష్ణ బిలాలు, న్యూట్రాన్‌ స్టార్స్‌ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన X – కిరణాల అధ్యయనానికి ఇస్రో తొలిసారిగా పోలారిమెట్రి మిషన్‌ చేపడుతోంది. పీఎస్‌ఎల్‌వీ – సీ 58 వాహకనౌక ద్వారా ఎక్స్‌పో – శాట్‌ శాటిలైట్‌ ను నింగిలోకి పంపనున్నారు. ఉదయం 9.10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపుతున్నట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ ఎక్స్‌పో శాట్ శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.

ఈ శాటిలైట్‌ను యుఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. పొలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోక చుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఎక్స్‌పో శాట్‌ మిషన్‌ తనలోని రెండు పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్‌ – కిరణాల మూలాల టెంపోరల్‌, స్పెక్ట్రల్‌, పోలరైజేషన్‌ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయగలదు. ఇందులోని ప్రాథమిక పేలోడ్‌, ఎక్స్‌- కిరణాలతో పొలారి మీటర్‌ పరికరం ఫోటాన్ల మధ్యస్థ ఎక్స్‌ – రే శక్తి పరిధిలో ధృవణ స్థాయి, కోణాన్ని కొలవనున్నాయి. ప్రస్తుతం ఇస్రో చేపడుతున్న ఈ ఎక్స్‌పో శాట్ శాటిలైట్ కనీసం ఐదేళ్ల పాటు తన పరిశోధనను నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button