తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జూలై 3: చరిత్రలో ఈరోజు

అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం

అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలు, నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మొదటిసారిగా 1930లో ఇంగ్లాండ్ లోని నార్త్ విచ్ లోని ఓ రసాయన కర్మాగారంలో అనుకోకుండా ప్లాస్టిక్ సృష్టి జరిగింది.

నేషనల్ ఫ్రైడ్ క్లామ్ డే

అమెరికాలో నేషనల్ ఫ్రైడ్ క్లామ్ డే జరుపుకుంటారు. ఆహారంలో ఆల్చిప్పల ప్రాముఖ్యత, వాటి వల్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తారు. లారెన్స్ హెన్రీ “చబ్బీ” వుడ్ మాన్, అతని భార్య బెస్సీ 1916 జూలై 3న మొదటిసారిగా ఫ్రైడ్ క్లామ్ తయారు చేశారు. అప్పటి నుంచి ఈ రోజును నిర్వహిస్తున్నారు.

ఎస్వీ రంగారావు పుట్టినరోజు

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత ఎస్. వి. రంగారావు 1918లో కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు.

హర్భజన్ సింగ్ పుట్టినరోజు

భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ 1980లో పంజాబ్ రాష్ట్రం జలంధర్ లో జన్మించారు. తొలిసారిగా 1998లో భారత టెస్ట్, వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తన కెరీర్ లో మొత్తం 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్ లు ఆడాడు.

టామ్ క్రూజ్ పుట్టినరోజు

హాలీవుడ్ నటుడు, నిర్మాత టామ్ క్రూజ్ 1962 అమెరికాలోని న్యూయార్క్ లో జన్మించాడు. ఇతని పూర్తి పేరు థామస్ క్రూజ్ మాప్రోడర్ IV. 1983లో రిస్కీ బిజినెస్ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించాడు. తన నటనతో రెండు సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button