తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

New Year: మహిళతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెకిలి చేష్టలు

కొత్త సంవత్సర వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెకిలి చేష్టలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించారు. కేక్ కట్ చేసి మహిళా చెంపకు రుద్దుతూ అసభ్యంగా రీతిలో వ్యవహరించారు. దీంతో అతడి తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తీరుపై అందరూ మండిపడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read కుమారుడి పెళ్లిపై షర్మిల కీలక ప్రకటన.. నిశ్చితార్థం, వివాహ తేదీలు వెల్లడి

కరీంనగర్ లో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి పొన్నం కేక్ కోసి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెనుకాల ఉన్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కేక్ కోసం ఎగబడ్డారు. కేక్ తీసుకుని ఎవరికైనా తినిపిద్దామని ప్రయత్నించారు. ఎవరూ లేకపోవడంతో ముందుభాగంలో ఉన్న ఓ మహిళా నాయకురాలికి తినిపించే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించడంతో ఎమ్మెల్యే సత్యనారాయణ అదే ప్రయత్నం చేశారు. చివరగా ఆమె చెంపకు కేక్ రుద్దారు. రెండు మూడుసార్లు ఇదే రీతిన వ్యవహరించారు.

Also Read అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. ‘దేవర‘ గ్లింప్స్ పై కీలక ప్రకటన

ఎమ్మెల్యే ప్రవర్తనతో ఆ మహిళా నాయకురాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడే ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యేపై ఆ నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేష్టల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుబట్టారు. అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button