తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Mobile Tariffs: జియో, ఎయిర్‌టెల్ దారిలోనే వోడాఫోన్ ఐడియా.. టారిఫ్‌లు భారీగా పెంపు

దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వినియోగదారుకు షాకిచ్చాయి. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. జియో గురువారం ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించగా, ఆ మరునాడే ఎయిర్టెల్, తాజాగా వొడాఫోన్ కూడా టారిఫ్‌లు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు జూలై 3 నుంచి అమలులోనికి రానున్నాయి. 5జీ స్పెక్ట్రం కోసం భారీగా ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్‌ను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. అయితే రిలయన్స్ జియో టారిఫ్‌ల పెంపు వెనుక మాత్రం మరో ఆసక్తికర అంశం కూడా చర్చకు వస్తోంది. ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌‌ల వివాహాన్ని జూలై 14న ఎంతో వైభవంగా జరిపించేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ వివాహానికయ్యే ఖర్చును టారిఫ్‌ల పెంపుతో కొంత మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ALSO READ: నేడే టీ – 20 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ మళ్లీ కప్పు కొట్టేనా?

జియో టారిఫ్స్

జులై 3 లోగా రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుత ప్లాన్ ధరలు వర్తిస్తాయి. అదే జులై 3 తర్వాత అయితే రేట్లు భారీగా పెరగనున్నాయని గ్రహించాలి. ఆలోపు చేసుకున్న వారు అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ కూడా అదనంగా పొందుతారు. గరిష్టంగా వార్షిక ప్లాన్లపై రూ. 600 మేర పెంచడం షాక్ కలిగించింది. పాపులర్ ప్లాన్ల పాత, కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నెలవారీ ప్లాన్ల విషయానికి వస్తే 2GB డేటాతో ఉన్న రూ. 155 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఇప్పుడు రూ. 189 కి లభిస్తుంది. డైలీ 1GB డేటాతో 28 రోజుల గడువు ఉన్న ప్లాన్ పాత రేటు రూ. 209 కాగా.. ఇప్పుడు అది రూ. 249 కి చేరనుంది. 1.5GB/Day రూ. 239 ప్లాన్.. రూ. 299కి చేరనుంది.

ఎయిర్‌టెల్ టారిఫ్స్

ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.199 అయింది. ఇందులో 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.265 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.299 అయింది. ఇందులో రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు వస్తాయి. రూ.299 ప్లాన్ ఇప్పుడు రూ.349 అయింది. రూ.359 ప్లాన్ రూ.409కి పెరిగింది. రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.449కి, రూ.455 ప్లాన్ ధర రూ.509కి, రూ.479 రీఛార్జ్ ప్లాన్ ధర రూ.579కి, రూ.549 ప్లాన్ ధర రూ.649కి, రూ.719 ప్లాన్ ధర రూ.859కి, రూ.839 ప్లాన్ ధర రూ.979కి పెరిగాయి. ఇక రూ.1,799 ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.1,999కి పెరిగింది. రూ.2,999 ప్లాన్ ధర రూ.3,599 అయింది. ఇక ఎయిర్ టెల్ డేటా యాడ్ ఆన్ ప్లాన్ల ధరలు కూడా పెరిగాయి. రూ.19 ప్లాన్ రూ.22, రూ.29 ప్లాన్ రూ.33, రూ.65 ప్లాన్ రూ.77 అయ్యాయి.

వోడాఫోన్ ఐడియా టారిఫ్స్

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. టారిఫ్‌లను 10-21 శాతం పెంచింది. పెంచిన ధరలు జూలై 4 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అపరిమిత కాలింగ్ కోసం రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా ఇప్పుడు రూ.199లు అయింది. వార్షిక రూ.2,899 ప్లాన్ ఇప్పుడు ధర. రూ.3,499కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button