తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Mumbai Police: న్యూ ఇయర్ వేళ కొత్త టెన్షన్.. ముంబైలో పోలీసులకు బెదిరింపు కాల్

న్యూయర్ రోజు ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడుతామని పోలీసులకు శనివారం సాయంత్రం ఓ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్ అందుకున్న పోలీసులు.. ముంబైలో హై అలర్ట్ విధించారు. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఇళ్ల నుండి బయటకు వచ్చే అవకాశం ఉన్న సమయంలో ఈ తరహా బెదిరింపులు రావడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: TS Police: న్యూ ఇయర్ వేళ తాగి బండి నడిపారో.. ఇక అంతే!

ఈ క్రమంలో పోలీసు స్టేషన్లు, క్రైమ్ విభాగాలను పోలీసులు అప్రమత్తం చేశారు. నగరంలోని పలు కీలక బహిరంగ ప్రదేశాలలో ఇప్పటికే సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు, పేలుడు పదార్థాలు లభించలేదని చెప్పారు. కాల్ చేసిన ఆ అజ్ఞాత వాసి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button