తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Parliament: పార్లమెంట్ పై దాడికి 22 ఏళ్లు

పార్లమెంట్ పై దాడి జరిగి సరిగ్గా 22 సంవత్సరాలు అవుతుంది. 2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా దాడి అనంతరం పోలీసులు గుర్తించారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు.

Also Read: భాగ్యనగరానికి మరో రికార్డ్.. దేశంలో నెం.1

ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి – మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. సిఆర్‌పిఎఫ్ కు చెందిన కమలేష్ కుమారి ఉగ్రవాదులను తొలుత గమనించి కేకలు వేసింది. ఉగ్రవాదులు వెంటనే కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ దాడితో భారత పాక్ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమై, 2001-02 నాటి సైనిక మోహరింపుకు దారితీసింది. 2001 నవంబరులో కాశ్మీరు శాసనసభపై జరిపిన ఇటువంటి దాడిలో ఉగ్రవాదులు 38 మంది ప్రజలను హతమార్చారు.

Also Read: మహదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ అరెస్ట్.. దుబాయ్ లో పట్టుకున్న పోలీసులు

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఇతర నేతలు పార్లమెంటుకు హాజరై వీర జవాన్లకు నివాళులర్పించారు.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button